ట్రంప్ టారిఫ్‌‌‌‌లు వేసినా.. ఇండియాలో తయారైన ఐఫోన్ యూఎస్లో చవకే

ట్రంప్ టారిఫ్‌‌‌‌లు వేసినా.. ఇండియాలో తయారైన ఐఫోన్ యూఎస్లో చవకే

న్యూఢిల్లీ: యాపిల్‌‌‌‌పై  డొనాల్డ్‌‌‌‌ ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించినా, ఇండియాలో తయారైన ఐఫోన్లు అమెరికాలో చౌకగానే ఉంటాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ) ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.  ఇండియాలో ఐఫోన్‌‌‌‌లు తయారు చేయడం అమెరికాతో పోలిస్తే చాలా చౌక అని,  ఇలాంటి టారిఫ్‌‌‌‌లు అమల్లోకి వచ్చినా ఇండియాలో తయారీ చవకగానే ఉంటుందని వివరించింది. 

 యాపిల్ ఇండియాలో ఐఫోన్‌‌‌‌లు తయారు చేస్తే 25శాతం టారిఫ్ వేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కంపెనీ షేర్లు శుక్రవారం  2.5 శాతం పడ్డాయి.  జీటీఆర్‌‌‌‌‌‌‌‌ఐ రిపోర్ట్ ప్రకారం..

ధరలు ఇలా..

వెయ్యి డాలర్ల ధర ఉండే ఒక ఐఫోన్‌‌‌‌లో, యాపిల్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌వేర్, డిజైన్‌‌‌‌ వాటా  450 డాలర్లు ఉంటుంది. అమెరికా (క్వాల్‌‌‌‌కామ్, బ్రాడ్‌‌‌‌కామ్) కాంపోనెంట్స్‌‌‌‌ వాటా 80 డాలర్లు. తైవాన్ చిప్స్‌‌‌‌ వాటా  150 డాలర్లు. సౌత్ కొరియా ఓఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్స్, మెమరీ చిప్స్‌‌‌‌ వాటా 90 డాలర్లు. 

జపాన్ కెమెరా సిస్టమ్స్‌‌‌‌ వాటా 85 డాలర్లు. జర్మనీ, వియత్నాం, మలేషియా నుంచి వచ్చే చిన్న పార్ట్స్‌‌‌‌ వాటా  45 డాలర్ల దగ్గర ఉంటుంది. చైనా, ఇండియాల్లో అసెంబుల్ చేసినా,  ఒక్కో ఫోన్‌‌‌‌పై 30 డాలర్లు  మాత్రమే సంపాదిస్తాయి. ఇది ఐఫోన్ రిటైల్ ప్రైస్‌‌‌‌లో 3 శాతం కంటే తక్కువ.

చవక ఎందుకంటే?

ఇండియాలో ఒక ఐఫోన్ అసెంబుల్ కాస్ట్ 30 డాలర్లు. అమెరికాలో ఇది 390 డాలర్లు. ఇండియాలో వర్కర్స్ నెల జీతం సగటున 230 డాలర్లు (సుమారు రూ.19,000), అమెరికాలో (కాలిఫోర్నియా వంటి స్టేట్స్‌‌‌‌లో) 2,900 (సుమారు రూ.2.4 లక్షలు) డాలర్లు.  అంటే 13 రెట్లు ఎక్కువ. ఇండియాలో ఐఫోన్ తయారీకి గవర్నమెంట్ నుంచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌‌‌‌ఐ) కూడా వస్తుంది. 

అందుకే, 25 శాతం టారిఫ్ ఉన్నా,  ఇండియాలో ఐఫోన్‌‌‌‌లు తయారు చేయడం వలన యాపిల్‌‌‌‌కు డబ్బులు ఆదా అవుతాయి.  అమెరికాలో తయారు చేస్తే, యాపిల్ ఒక్కో ఐఫోన్‌‌‌‌పై పొందే  ప్రాఫిట్ 450 డాలర్ల నుంచి 60 డాలర్లకి పడిపోతుంది.  లేదా రిటైల్ ధర బాగా పెంచాలి.