Devara2: ప్రతి తీరాన్ని వణికించిన దేవర.. మరింత అలజడితో వస్తున్నాడు: దేవర 2పై కీలక అప్డేట్

Devara2: ప్రతి తీరాన్ని వణికించిన దేవర.. మరింత అలజడితో వస్తున్నాడు: దేవర 2పై కీలక అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మాస్ ఎంటర్టైనర్ దేవర రిలీజై ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా మేకర్స్ దేవర 2పై కీలక అప్డేట్ ఇచ్చారు. 2024 సెప్టెంబర్ 27న దేవర రిలీజై బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్రమంలో దేవర చివర్లో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సెకండ్ పార్ట్పై ఆసక్తి పెంచారు కొరటాల.

ఇందులో భాగంగా దేవర 2 రాక కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ శనివారం (2025 సెప్టెంబర్ 27న) దేవర నిర్మాతలు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2 కోసం సిద్ధం అవ్వండి అని మేకర్స్ తెలిపారు.

‘‘ప్రతి తీరాన్ని వణికిస్తూ అలజడి సృష్టించి సంవత్సరం అయ్యింది.. అప్పటినుండి ప్రపంచం గుర్తుంచుకునే పేరు దేవర. అది భయం అయినా లేదా అది సంపాదించిన ప్రేమ అయినా, వీధులు ఎప్పటికీ మర్చిపోవు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర 2 కోసం సిద్ధం అవ్వండి.. అతి త్వరలో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు’’ అని మేకర్స్ తెలిపారు. 

ఇప్పటికే కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ -ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. త్వరలో షూటింగ్ పనులు సైతం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా సైఫ్ అలీఖాన్‌‌‌‌‌‌‌‌, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.

►ALSO READ | TheRajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. ట్రైలర్, ఫస్ట్ సింగిల్తో రాజాసాబ్ వస్తున్నాడు

అయితే, పార్ట్ కోసం బాలీవుడ్ స్టార్స్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) లేదా రణ్ బీర్ కపూర్‌ (Ranbir Kapoor) లను దేవర ప్రపంచంలో చూడబోతున్నట్లు కొరటాల ఇటీవలే ఓ హింట్ ఇచ్చారు. ఏమవుతుందో చూడాలి! ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని  నిర్మించనున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.