
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 2న విడుదల అవుతున్న ‘కాంతార ఛాప్టర్ 1’ మూవీతో పాటు ‘ది రాజా సాబ్’ ట్రైలర్ కూడా ప్రదర్శించబోతున్నారు.
తాజాగా ట్రైలర్‌కి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. 3 నిమిషాల 30 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్‌కి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. టీజర్‌లో రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ చూపించిన దర్శకుడు మారుతి, ఈసారి అందుకు భిన్నంగా హారర్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ALSO READ : TheParadise: జడల్తో తలపడనున్న శికంజా.. శ్రీకాంత్ ఓదెల మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..
మరోవైపు అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల నిర్మాత విశ్వ ప్రసాద్ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో వచ్చే నెలలో ప్రభాస్ ఆయన ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్ధమవుతోంది.
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ.. సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయబోతున్నారు.