ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ‘దేవర ముంగిట నువ్వెంత’ అంటూ ఈ చిత్రంలోని మొదటి పాటతో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన టీమ్.. తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ‘సిజ్లింగ్ డ్యుయో కా లవ్ ధమాకా’ అంటూ పోస్ట్ చేసి ఆగస్టు 5న సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్‌లో కనిపించారు. ఈ రొమాంటిక్ సాంగ్‌కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన నిర్మాత నాగవంశీ ‘ఎన్టీఆర్ అన్న నటించిన ఎపిక్ యాక్షన్ మూవీతో అసోసియేట్ అవడం ప్రౌడ్‌గా ఉంది’ అని పోస్ట్ చేశారు.