ఖేలో ఇండియాతో దేశంలో క్రీడాభివృద్ది : ప్రధాని మోదీ

ఖేలో ఇండియాతో దేశంలో క్రీడాభివృద్ది : ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్: ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో క్రీడాభివృద్ధికి, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. క్రీడలకు బడ్జెట్ ను మూడు రెట్లు పెంచామన్నారు ప్రధాని.  వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శనివారం (సెప్టెంబర్ 23న) శంకుస్థాపన చేసిన మోదీ.. యువతలో క్రీడల్లో రాణించేందుకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు ప్రధాని మోదీ. 

మహదేవుని నగరంలో నిర్మించిన స్టేడియాన్ని  మహదేవునికి అంకితం చేస్తున్నామన్నారు. క్రికెట్ ద్వారా ప్రపంచం భారత్‌తో అనుసంధానం అవుతోందని ప్రధాని అన్నారు. దేశంలోని యువతలో  క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు క్రికెట్ శిక్షణ అవకాశం లభిస్తుందన్నారు ప్రధాని. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్నారు ప్రధాని. క్రికెట్తో  ప్రపంచం మొత్తం భారత్‌తో అనుసంధానం అవుతోంది. కొత్త దేశాలు ఇప్పుడు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తున్నాయి అని చెప్పారు ప్రధాని మోదీ.