2014కు ముందు కల్లు చీప్ డ్రింక్

2014కు ముందు కల్లు చీప్ డ్రింక్

కేసీఆర్ సీఎం అయిన తర్వాతే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్లలో జరిగిందని..ప్రజల బతుకులు బాగుపడ్డాయన్నారు. కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చారన్నారు. 2014కు ముందు కల్లును చీప్ డ్రింక్ గా చేసి గత ప్రభుత్వాలు చూపించాయన్నారు. గతంలో గౌడులపై వేధింపులు జరిగేవని.. దేశంలో గీత వృత్తిలో ఉన్నోళ్లకు పింఛన్, ఎక్స్ గ్రేషియా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. సర్కారు భూముల్లో ఈత వనాలు పెంచాలన్నారు. గత ప్రభుత్వాలు వెయ్యి ఈత చెట్లు పెట్టిన పాపనపోలేదని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో రాష్టంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గీత వృత్తిలో ఉన్క ప్రతి ఒక్కరు నెలకు 20 వేల రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు.