దివ్యాంగుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలి.. డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ డిమాండ్

దివ్యాంగుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలి.. డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ డిమాండ్
  • దివ్యాంగుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలి
  • డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : అన్ని రాజకీయ పార్టీలు దివ్యాంగుల సమస్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని డెవలప్ మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ డిమాండ్ చేసింది.  బుధవారం నల్లకుంటలోని రాష్ట్ర ఆఫీసులోసమావేశం జరిగింది.  సొసైటీ ఫర్ ది డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ మాట్లాడుతూ..  దివ్యాంగుల బ్యాక్​లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేయాలన్నారు.

అర్హులైన దివ్యాంగులందరికీ రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, చట్టసభల్లో నాలుగు శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించాలని కోరారు.  దివ్యాంగులకు మూడు చక్రాల బైక్​లు, మొబైల్స్, ల్యాప్ టాప్స్ ఉచితంగా పంపిణీ చేయాలన్నారు.  సమావేశంలో నేషనల్ కో- కన్వీనర్ వెంకటేశ్ గౌడ్,  కిశోర్ తదితరులు పాల్గొన్నారు.