హరీష్ రావు నగర్ లో అభివృద్ధి పనులు

హరీష్ రావు నగర్ లో అభివృద్ధి పనులు

సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిధిలోని తన్నీర్ హరీష్ రావు(THR) నగర్ లో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఈ ఉదయం పర్యటించారు. రూ.40లక్షల అంచనాతో మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు.

స్థానికులతో ఏర్పాటుచేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. రూ.కోటి 60లక్షలతో భారీ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని.. ప్రతి ఇంటికి మూడు నెలల్లో స్వచ్ఛమైన త్రాగునీరు రాబోతుందని చెప్పారు. త్వరలోనే కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 2 రోజుల్లో వీధుల్లో LED బల్బులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అర ఎకరా స్థలంలో శ్మశాన వాటిక, రేషన్ షాప్, అంగన్ వాడి సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. రోడ్లను కబ్జా చేసి ఇండ్లు నిర్మించొద్దని సూచించారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని ఎవరూ కొనొద్దని.. పేదలు కూడా అమ్మకూడదని.. అది చట్టరీత్యా నేరం అని హరీష్ రావు హెచ్చరించారు. తప్పనిసరిగా.. ప్రతి ఒక్కరు ఇంటిముందు వేప చెట్టు పెంచాలని కోరారు హరీష్ రావు.