డీఎస్పీ లైవ్ పర్ఫామెన్స్..ఇక లండన్లో తెలుగు పాటలు

 డీఎస్పీ లైవ్ పర్ఫామెన్స్..ఇక లండన్లో తెలుగు పాటలు

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరో ఇంట్రస్టింగ్ ఇన్ఫర్మేషన్ను తన అభిమానులతో పంచుకున్నాడు. తమ మ్యూజిక్ తో...ఊపొచ్చే పర్ఫామెన్స్ తో సంగీత ప్రియులను ఆకట్టుకునే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్..గ్రాండ్ కచేరి ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. లండన్ వేదికగా  ఈ గ్రాండ్ కచేరీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. 

2024 జనవరి 13, 14వ తేదీల్లో లండన్ లో లైవ్ పర్ఫామెన్స్ చేయబోతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్. డీఎస్పీ లైవ్ ఇన్ లండన్ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దేవీ శ్రీ ప్రసాద్ పోస్టుతో లండన్ లోని తెలుగు, తమిళ ప్రజలు ఫుల్ ఎగ్జైట్మెంట్ గ ఫీలవుతున్నారు.  అంతేకాకుండా టికెట్స్ ఓపెన్ అయినట్లు లింకులను కూడా షేర్ చేశాడు. ఈ మ్యాజిక్ కచేరిలను రెయిన్‌బో స్కై వారు నిర్వహిస్తున్నారు. 

టాలీవుడ్ లో దేవీ శ్రీ ప్రసాద్ అందరు హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించాడు. చిరంజీవి,  పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌,రవితేజ, బాలయ్య వంటి అగ్ర హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. గతంలో టాలీవుడ్ కే పరిచయం అయిన డీఎస్పీ..ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ..గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం ఆయన చేతిలో పుష్ప -2తో పాటు.. పలు పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయి.