శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు

వీకెండ్ తో తిరుమలకు భక్తులు మరోసారి పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. దీంతో బయట ఆస్థాన మండపం వరకు క్యూ లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 44 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 68 వేల 873 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 38 వేల 952 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.