తిరుమల సర్వ దర్శనానికి 6 గంటలు

తిరుమల సర్వ దర్శనానికి 6 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వీకెండ్ కు భక్తుల సంఖ్య మరింత పెరగనున్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి టీటీడీ శ్రీవారి మెట్ల మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్ల మార్గం భారీగా ధ్వంసమైంది. దీంతో మెట్ల మార్గంలో టీటీడీ పునరుద్దరణ పనులు చేసింది. త్వరలో టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాలను, అలాగే నడకదారి భక్తులకు దివ్వ దర్శనాలను తిరిగి ప్రారంభించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నిన్న తిరుమల శ్రీవారిని 65 వేల 756 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 60 లక్షలు రాగా, కళ్యాణ కట్టలో 34,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

మరిన్ని వార్తల కోసం...

కరోనా నెగెటివ్​ వస్తే ఊరవతలికి..

సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు