కరోనా నెగెటివ్​ వస్తే ఊరవతలికి..

కరోనా నెగెటివ్​ వస్తే ఊరవతలికి..

షాంఘైలో జనాలను బస్సుల్లో బలవంతంగా తరలిస్తున్న చైనా

షాంఘై: చైనాను కరోనా షేక్​ చేస్తోంది. షాంఘై సిటీలో కరోనా వైరస్​ విజృంభిస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వైరస్​ తాకిడికంటే అధికారుల కఠిన ఆంక్షలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా వారాలుగా షాంఘై వాసులు ఇండ్లకే పరిమితమైపోయారు. కరోనా పాజిటివ్​ వచ్చిన వందలాది మందికి ఇంట్లో క్వారంటైన్​అమలు చేస్తున్నారు. నెగెటివ్​ వచ్చిన వాళ్లను ఏకంగా వందల కిలోమీటర్ల దూరం తరలిస్తున్నారు. ‘‘అర్ధరాత్రి నన్ను, మా చుట్టుపక్కల వాళ్లను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి క్వారంటైన్​ సెంటర్ కు తీసుకెళ్లారు. మా కాంపౌండ్​లో చాలా పాజిటివ్​ కేసులు వచ్చాయని పోలీసులు చెప్పారు. అందువల్ల మేము కూడా ఇక్కడే ఉంటే వైరస్​ బారినపడతామనే క్యాంపులకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. మాకు వేరే చాయిస్​ లేదు. మళ్లీ మేము ఎప్పుడు తిరిగి ఇంటికి వెళతామనేది తెలియడంలేదు”అని షాంఘైకి చెందిన లూసీ అనే మహిళ చెప్పారు. షాంఘైకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని అన్హుయి ప్రావిన్స్​లో ఏర్పాటు చేసిన ప్రీప్యాబ్​ క్యాబిన్లలో వీరిని ఉంచుతున్నారు. అయితే తమను ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయం వారికి చెప్పలేదు. అక్కడికి వెళ్లాక సింగిల్​ రూమ్స్​లో ఒక్కొక్కరినీ ఉంచుతున్నారు.