ఆదిలాబాద్ లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

ఆదిలాబాద్ లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

నేరడిగొండ/జన్నారం/ఆదిలాబాద్, వెలుగు: తొలి ఏకాదశి పండుగను ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూజలు చేశారు. 

నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్ తదితరులున్నారు. జన్నారం మండల కేంద్రంలోని రామాలయంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ప్రజలు పూజలు చేశారు. మండల కేంద్రంలోని రామాలయంలో ఆలయ కమిటీ అధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు.