- కోడె మొక్కు చెల్లింపు
వేములవాడ, వెలుగు : ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీగా ఎక్కువ కావడంతో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భీమన్న ఆలయంలో ఈవో ప్రత్యేక పూజలు..
భీమేశ్వరస్వామి ఆలయంలో లోక కళ్యాణం, విశ్వశాంతి కోరి ఆలయ ఈవో రమాదేవి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శాంతి హోమం నిర్వహించారు.
