కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉదయం నుంచే కోనేరులో స్నానాలు చేసి మల్లికార్జునస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అందులో భాగంగా పట్నం, అభిషేకం, దీపాలు వెలిగించుట, అర్చన, నిత్య కల్యాణం, బోనం, తిరుగుడు కోడె, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న కొండపై కొలువైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. భక్తుల సౌకర్యాలను ఈఓ వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్​చంద్రశేఖర్,  ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.