మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి

​తాడ్వాయి, వెలుగు : తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం, సమ్మక్క, సారలమ్మ, వన దేవతల దర్శనాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.  దేవతల గద్దెల వద్దకు చేరుకొని ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం బంగారం (బెల్లం) ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, సారే, గాజులు, సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం పరిసరాల్లో వనబోజనాలు చేశారు.  

అమ్మవారిని దర్శించుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్​ మేడారం అమ్మ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వనదేవతలకు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయగా,  ఎండోమెంట్ అధికారులు ప్రసాదాన్ని అందజేశారు.