మల్యాల, వెలుగు: మల్యాల శివారులోని మల్లెగుట్టపై కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. దండారం కావడంతో బుధవారం రాత్రి నుంచి భక్తుల రాక మొదలైంది.
అక్కడే బస చేసిన భక్తులు గురువారం స్వామి వారిని దర్శించుకొని బోనాలతో మొక్కులు సమర్పించారు. ఆలయంలో మల్లన్నకు మైలపోలు తీసి, కల్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం నాగవల్లి, పెద్దపట్నం, తదితర పూజలు చేశారు.
