వేములవాడ, వెలుగు: వేములవాడ భీమేశ్వర ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ఉదయమే భీమేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు. భీమేశ్వర స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కోడెలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
