వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల్లో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల్లో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం రాజన్నను దర్శించుకొని భీమేశ్వరాలయంలో కోడెమొక్కులు చెల్లించుకొని, కార్తీక దీపాలు వెలిగించారు. వేములవాడలో అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజగోపుర మార్గం నుంచి మాత్రమే భక్తులను అనుమతించడంతో భక్తులు భారీ ఎత్తున గుమిగూడారు.