మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం(ఫిబ్రవరి 04) సెలవు దినం కావడంతో ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు వస్తున్నారని తెలిపారు ఆలయ అధికారులు. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. దీంతో సమ్మక్క, సాలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. 

అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. వన దేవతలకు బెల్లం, చీర సారెలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

దీంతో ప్రజలు, వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోపక్క.. ప్రభుత్వం జాతర కోసం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ మేడారం పరిసరాల్లో తాగునీటి కొరత భారీగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పూర్తి స్థాయి జాతరలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన అధికార యంత్రాంగం సమస్యలపై దృష్టి సారించి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.