సిగరెట్లతో శివుడికి భక్తుల మొక్కులు

సిగరెట్లతో శివుడికి భక్తుల మొక్కులు

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజామునుంచే భక్తులు భారీ సంఖ్యలో శివాలయాలకు తరలి వచ్చి భోళా శంకరుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పాలు, పండ్లు సమర్పించుకుంటారు. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో శివరాత్రి రోజు శివుడికి సిగరెట్లు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా… ఇక్కడ ఈ ఆచారం ప్రతీ  ఏడాది అనాదిగా వస్తోందట.

లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివుడికి భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకున్నారు. సిగరెట్లను అక్కడి శివలింగంపై ఉంచగానే అవి వాటంతట అవే వెలుగుతాయని భక్తుల నమ్మకం. సిగరెట్లను సమర్పించడంతో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. ప్రతీ ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.