రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు

రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా.. శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు.. శివాలయాలకు క్యూ కట్టారు. ముక్కంటి దర్శనానికి పోటెత్తారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు.. శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి ఆలయాలు. 

వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు. ఆలయంలో పూజలు చేసి..మొక్కులు సమర్పించుకుంటున్నారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగుతోంది. శివరాత్రి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు.

జగిత్యాల జిల్లాలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సారంగపూర్ మండలం పెంబట్ల కొనాపూర్ లోని దుబ్బ రాజన్న ఆలయంలో శివపార్వతుల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ రవి.

మంచిర్యాల జిల్లా కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. పవిత్ర త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామివారి దివ్యలింగానికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తున్నారు. ఆలయానికి పడమర దిక్కున వైరా నది ప్రవహించడం, ఉత్తరాన స్మశానం ఉండటంతో భక్తులు దక్షిణ కాశీగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే కాశీలో ఉన్న పరమశివుని దర్శించుకున్న భావన కలుగుతుందంటున్నారు భక్తులు.

హనుమకొండలో శివరాత్రి సందడి కనిపిస్తోంది. శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సిద్ధేశ్వర ఆలయం వెనకాల గుట్ట ప్రాంతంలో.. జాగారం కోసం లైటింగ్ ఏర్పాటు చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల్లో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని గౌరీశంకర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని డీటేల్స్ వెంకటేశ్ అందిస్తారు. 

మెహన్ బాబు, విష్ణు చిత్రహింసలు పెట్టిన్రు