విషపు నురగల్లో నిల్చుని నైవేద్యాలు సమర్పించిన భక్తులు

విషపు నురగల్లో నిల్చుని నైవేద్యాలు సమర్పించిన భక్తులు

ఉత్తర భారతదేశంలో ఛట్‌ పూజలు వైభవంగా జరుగుతున్నాయి. యమునా నదిలో పుణ్యస్నానాలు చేసి.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఢిల్లీ, బీహార్, యూపీ, జార్ఖండ్ లో ఛట్ పూజలు వైభవంగా జరుపుకుంటున్నారు. దీపావళి తర్వాత వచ్చే కీలక పండుగల్లో ఛట్ పూజ ఒకటి. నాలుగు రోజుల పాటు జరిగే ఛట్‌ పూజల్లో ఇవాళే చివరి రోజు కావడంతో భక్తులు.. సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి, అర్ఘ్యాలు సమర్పిస్తున్నారు. మూడు రోజుల ఉపవాసం విడిచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఢిల్లీలోని కళిందికుంజ్ దగ్గరలో విషపు నురగతో నిండిన యమునా నదిలో పవిత్ర స్నానాలు చేసి.. ఆ తర్వాత మోకాళ్ల లోతు నీటిలో నిలబడి భక్తులు సూర్య భగవానుడికి నైవేద్యాలు సమర్పించారు మహిళలు.