కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.  వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2024 మార్చి 17  తొమ్మిదివ ఆదివారం కావడంతో భక్తులు పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 3 గంటలు, ధర్మ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 

గదులు లేకపోవడంతో కొందరు భక్తులు తాము వచ్చిన వాహనాల్లోనే బస చేస్తున్నారు. కొందరు ఖాళీ స్థలాల్లో టెంట్లు వేసుకొని బస చేస్తున్నారు. ఆదివారం స్వామిని దర్శించుకున్న అనంతరం పూజలు చేస్తారు. సోమవారం పెదపట్నం, అగ్నిగుండ కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తులు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ALSO READ:- అకాల వర్షం.. మామిడి రైతులకు అపార నష్టం