V6 News

ఆధ్యాత్మికం:  చిన్న ఉపాయం.. ఆర్థిక సమస్యలు పరార్.. ఏప్రిల్ 27న ఇలా చేయండి..

ఆధ్యాత్మికం:  చిన్న ఉపాయం.. ఆర్థిక సమస్యలు పరార్.. ఏప్రిల్ 27న ఇలా చేయండి..

మోహినీ ఏకాదశి 2026: మోహినీ ఏకాదశి 27 ఏప్రిల్ 2026 న ఉంది. వైశాఖ మాసం శుక్ల పక్షం ఏకాదశి తేదీని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున తులసీమాతను, లక్ష్మీ నారాయణులను పూజించి  కొన్ని నివారణలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

హిందూ పురాణాల్లోని పద్మ పురాణం  ప్రకారం, వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని 'మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2026) ఏప్రిల్​ 27 సోమవారం వైశాఖమాసం శుక్ల పక్షం ఏకాదశి వచ్చింది. ఆరోజుకు  ప్రత్యేకమైన చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు.

మోహిని ఏకాదశి శుభ ముహూర్తం వివరాలు

 వైశాఖ శుక్ల ఏకాదశి (మోహిని ఏకాదశి)తిథి ప్రారంభం: ఏప్రిల్ 26 సాయంత్రం 06:06 గంటలకు
 వైశాఖ శుక్ల ఏకాదశి ( మోహిని ఏకాదశి) తిథి ముగింపు: . ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 06:15 గంటలకు సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుని, ఏప్రిల్ 27, సోమవారం నాడు భక్తులు మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28న ఉదయం ద్వాదశి ఘడియల్లో వ్రత పారణ (ఉపవాస విరమణ) చేయాల్సి ఉంటుంది.

ఆ రోజు ఏం చేయాలి.

హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  ఆ రోజున (ఏప్రిల్​ 27)తులసి మంజరి ( ఎండిన పూతతో)కొన్ని పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.  మోహిని ఏకాదశి రోజున ( 2026 ఏప్రిల్​ 27) బ్రహ్మ ముహూర్తంలో కాలకృత్యాల అనంతరం తులసి చెట్టుకు ఉన్న ఎండిన మంజరిని సేకరించి.. ఒక ఎర్రటి వస్త్రంలో .. కొద్దిగా బియ్యం.. పసుపు.. కుంకుమ .. అక్షింతలతో పూజ చేయాలి.  తరువాత దానిని కట్టి .. మహాలక్ష్మీ అమ్మవారిని ధ్యానిస్తే  విలువైన ఆభరణాలు.. నగదు దాచుకొనే బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచి, నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

అప్పుల బాధల నుండి విముక్తి 

 అప్పులతో సతమతమవుతున్న వారికి మోహిని ఏకాదశి పూజ ఒక అద్భుతమైన అవకాశమని పండితులు చెబుతున్నారు. ఆ రోజు( 2026 ఏప్రిల్​ 27)  సాయంత్రం పాలలో తులసి మంజరిని కలిపి శ్రీమహావిష్ణువుకు అభిషేకం చేయాలి.ఇలా చేయడం  వల్ల జాతకంలో దేవగురువు బృహస్పతి బలపడతాడు. గురు గ్రహ అనుగ్రహం కలిగితే ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాకుండా, అప్పుల ఊబి నుండి త్వరగా బయటపడతారని పండితులు చెబుతున్నారు.

ఇంకా ఏమేమి చేయాలంటే..

మోహిని ఏకాదశి రోజున ( 2026 ఏప్రిల్​ 27) విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించాలి.  మోహిని విష్ణువు రూపం. .  ఉపవాస దీక్షను పాటించి ఆ రోజు అంతా స్వామిధ్యానంలో గడపాలి.  విష్ణుసహస్రనామం పఠించాలి.  స్వామి వారికి పచ్చని పండ్లను.. పసుపు రంగు స్వీట్లను నివేదించాలి.   

  • సూర్యోదయానికి ముందే  నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి.  స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి.  లేదంటే ఉతికిన బట్టలైనా కట్టుకోవచ్చు.
  • దేవుని మందిరం దగ్గర మోహిని అవతారమైన విష్ణుమూర్తి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి.  గంగా జలం ఉంటే ఆ స్థలాన్ని శుద్ది చేసుకోండి. 
  • విష్ణుమూర్తికి... అమ్మవారికి తులసి దళాల దండను సమర్పించండి.  అయితే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో  తులసి చెట్టును ముట్టుకోరాదు.  ముందు రోజే కోసి ఆకులను శుభ్రమైన ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. 
  • విష్ణుమూర్తి చిత్ర పటాన్ని పసుపు.. కుంకుమ..  గంధంతో అలంకారం చేయాలి. స్వామివారికి పసుపురంగు వస్త్రాలు కట్టాలి. 
  • మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని...పూజించాలి.  విష్ణు సహస్రనామం చదవాలి.  లేకపోతే భక్తితో వినాలి. పూజలో తులసి దళాలను  తప్పని సరిగా ఉపయోగించాలి. 
  •  ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం.
  • మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి.
  •  ముందు రోజు నుంచి అంటే దశమి తిథి( ఏప్రిల్​ 26 ) నుంచే సాత్విక ఆహారాన్ని తినాలి.
  • ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవును సేవించండి. వాటికి పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి.
  • మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత, తమ శక్తి మేరకు ధాన్యాలు, బెల్లం, డబ్బు దానం చేయాలి.