ఆధ్యాత్మికం.. తెలుగు నెలలు.. మూడవ మాసం.. నిజ జ్యేష్ఠమాసం.. పండుగలు.. పుణ్య తిథులు ఇవే..!

ఆధ్యాత్మికం.. తెలుగు నెలలు.. మూడవ మాసం.. నిజ జ్యేష్ఠమాసం.. పండుగలు.. పుణ్య తిథులు ఇవే..!

తెలుగుమాసాల్లో మూడో మాసం కొనసాగుతుంది.  ఈ ఏడాది అధిక జ్యేష్ఠమాసం ముగిసి .. నిజజ్యేష్ఠమాసం మొదలైంది.  పురాణాలు.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మాసానికి ( జులై 14) చాలా విశిష్టత ఉంది.  చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తాడు. ఈ నెలలో తెలుగు పంచాంగం ప్రకారం అధిక జ్యేష్ఠ మాసం అనంతరం.. నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. నిర్జల ఏకాదశి, భాను సప్తమి, శని ప్రదోషం, మాస శివరాత్రి వంటి అనేక పర్వదినాలు, పుణ్య తిథులు వచ్చాయి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .

 

  • జూన్ 17 బుధవారం  :  జ్యేష్ఠ శుద్ధ తదియ...రంభ తృతీయ వ్రతం
  • జూన్ 21 ఆదివారం:  జ్యేష్ఠ శుద్ధ సప్తమి... భాను సప్తమి, ప్రపంచ యోగా దినోత్సవం
  • జూన్ 22 సోమవారం:   జ్యేష్ఠ శుద్ధ అష్టమి...  ఆరుద్ర కార్తె, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగం
  • జూన్ 24, బుధవారం:   జ్యేష్ఠ శుద్ధ దశమి...  దశపాపహర దశమి, నారాయణ వనం శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మగింపు
  • జూన్ 25 గురువారం :  జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి... నిర్జల ఏకాదశి, తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల అమ్మవార్ల  తెప్పోత్సవాలు ప్రారంభం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం
  • జూన్ 26  శుక్రవారం:   జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి.. రామలక్ష్మణ ద్వాదశి, తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం మహోత్సవం ప్రారంభం
  • జూన్ 27 శనివారం : జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ....శని త్రయోదశి, శని ప్రదోషం
  • జూన్ 28 ఆదివారం : జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి... తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం మహోత్సవం ముగింపు
  • జూన్ 29 సోమవారం : జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి.... ఏరువాక పున్నమి, వృషభ పూజనం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ, కబీర్ దాస్ జయంతి, వటసావిత్రి వ్రతం, తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల తెప్పోత్సవాలు ముగింపు.
  • జూలై 2 గురువారం : జ్యేష్ఠ బహుళ తదియ.... అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం
  • జూలై 3  శుక్రవారం:  జ్యేష్ఠ బహుళ చవితి.... సంకష్టహర చవితి, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజావరోహణం, బ్రహ్మోత్సవాలు ముగింపు
  • జూలై 6 మంగళవారం:  జ్యేష్ఠ బహుళ షష్టి...పునర్వసు కార్తె
  • జూలై 10 శుక్రవారం:  జ్యేష్ఠ బహుళ ఏకాదశి.... యోగిని ఏకాదశి
  • జూలై 12 ఆదివారం : జ్యేష్ఠ బహుళ త్రయోదశి/ చతుర్దశి... పక్ష ప్రదోషం, మాసశివరాత్రి
  • జూలై 14, మంగళవారం : జ్యేష్ఠ బహుళ అమావాస్య: దర్శ అమావాస్య ఈ రోజుతో నిజ జ్యేష్ఠ మాసం ముగిసి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది.