ఆధ్యాత్మికం:  మాంసాహారులు ఉపవాసం ఉండవచ్చా.. పురాణాలు.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

ఆధ్యాత్మికం:  మాంసాహారులు ఉపవాసం ఉండవచ్చా.. పురాణాలు.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

పండుగ వచ్చినా.. పబ్బం వచ్చినా.. ఆధ్యాత్మికంగా విశేషమైన రోజుల్లో పండితులు ఉపవాసాలు..పూజలను ఆచారబద్దంగా జరపాలని  పండితులు చెబుతున్నారు.  ఆ సమయంలో దైవ నామస్మరణలో నిమగ్నమై.. అనుష్టానం.. జపాలు చేసుకోవాలి.  కులదైవాన్ని ప్రార్థిస్తూ దీక్షను పాటించాలి. కానీ మాంసాహారం తినే వారి మనస్సులలో తరచుగా ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. మాంసాహారం తినేవారు ఉపవాసాన్ని పాటించవచ్చో లేదో అని తరచుగా ఆలోచిస్తుంటారు. శాస్త్రాలలో వారికి సంబంధించి ఏవైనా నిర్దిష్ట నియమాలు లేదా నిషేధాలు ఉన్నాయా?  .. శాస్త్రాల్లో ఏముందో  ఈ స్టోరీలో తెలుసుకుందాం...

శాస్త్రాల ప్రకారం.. భగవద్గీతలో చెప్పిన విధంగా.. ఆహారంలో మూడు రకాలు ఉన్నాయి: సాత్విక, రాజసిక, తామసిక. మాంసాహారాన్ని తామసిక ఆహారంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం, తామసిక ఆహారం కోపాన్ని, అజ్ఞానాన్ని పెంచుతుంది. సాత్విక శక్తిని మేల్కొలపడానికి ఉపవాసం పాటిస్తారు. ఆధ్యాత్మికంగా  ఉపవాసం  సమయంలో శరీరం, మనస్సు శుద్ధీకరణ అవసరమని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఉపవాసం రోజులలో అహింసను పాటించాలి.

మాంసాహారులు ఉపవాసం ఉండలేరా?

పాత అలవాట్లను విడిచిపెట్టడం ద్వారా ఒక వ్యక్తి శుద్ధీకరణ వైపు పయనించగలడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైనా సంవత్సరం పొడవునా మాంసాహారం తిన్నంత మాత్రాన వారు ఉపవాస వ్రతం పాటించలేరని కాదు.   అలాంటి వారు ఉపవాస దీక్షను ప్రారంభించాలంటే.. అంతకంటే ముందకు ఒక రోజు ముందు నుంచి మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలని శాస్త్రాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. 

ఉపవాస సమయంలో కోపం.. ఆవేశం.. మొదలైన చెడును ప్రేరేపించే అలవాట్లకు దూరంగా ఉండాలి.  అంటే మామూలు రోజుల్లో అలా ఉండమని కాదు.  ఉపవాసం చేస్తూ అలాంటి లక్షణాలను ప్రదర్శిస్తే.. మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.  మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి  తింటే కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ముందు రోజు తింటే ఆ ఆహారం ప్రభావం తరువాత రోజు కూడా ఉంటుంది.  అందుకే ఉపవాసం చేయడానికి ఒక రోజు ముందుగా వాటికి దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.   సో..ఇలాంటి నియమాలు పాటించి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. మాంసాహారులు కూడా ఉపవాస దీక్షను భక్తితో.. పాటించాలని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.