ఆధ్యాత్మికం: తెలుగు సంవత్సరం.. చివరి మాసం.. పవిత్ర ఫాల్గుణమాసం.. ఎలాంటి పూజలు చేయాలి..!

ఆధ్యాత్మికం: తెలుగు సంవత్సరం.. చివరి మాసం.. పవిత్ర ఫాల్గుణమాసం.. ఎలాంటి పూజలు చేయాలి..!

తెలుగు నెలల్లో చివరి నెల కొనసాగుతుంది.  పంచాంగం ప్రకారం విశ్వావశునామ సంవత్సరంలో ఫాల్గుణమాసం కొనసాగుతుంది. పురాణాల ప్రకారం ఈ నెల విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది.  హోలి.. ముస్లింలు అత్యంత పవిత్రంగా రంజాన్​ పండుగ కూడా ఇదే నెలలో వస్తుంది.  పాల్గుణమాసంలో  పాటించాల్సిన నియమాలతో పాటు ఏఏ పూజలు ఎప్పుడు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

తెలుగు మాసాల్లో చివరి మాసం ఫాల్గుణ మాసం ప్రారంభమైంది.  2026  మార్చి 18వ తేదీ వరకు ఈ ఫాల్గుణ మాసం కొనసాగుతుంది.  ఈ నెల అంటే మహావిష్ణువుకు చాలా ఇష్టం.. ఈ నెల సర్వ దేవతలను పూజించేందుకు అనుకూలమైన మాసం.  ఈ పవిత్ర మాసం దానధర్మాలు .. గోదానం.. భూదానం వస్త్రదానం చేయడం వలన  అన్ని గ్రహాల దోషాలు తొలగి..విద్య, ఉద్యోగ , వ్యాపార రంగాల్లో అన్ని విధాలా విజయం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. 

 అందువలన  ధనదానం, గోదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుందని పండితులు చెబుతుంటారు.  వయో వ్రతం.. అమలక ఏకాదశి పూజలు చేయడం వలన కష్టాలు తొలగి అన్నివిధాలా లాభం చేకూరుతుంది. 

గోదానం.. వేల రెట్ల ఫలితం:   గోవు సకల దేవతల స్వరూపంగా భావించి పూజలు చేస్తాము.   ప్రత్యక్షంగా గోవును శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి దానం చేయడం అత్యంత శుభకరమని పురాణాల ద్వారా తెలుస్తుంది.  విష్ణు ఆలయానికి గోదానం చేస్తే వేల రెట్ల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యక్ష గోదానం చేయలేనివారు ఫాల్గుణ మాసంలో వెండి, రాగి, లేదా పంచలోహాలతో చేసిన ఆవు బొమ్మను విష్ణు సంబంధమైన ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి దానం చేసినా అలాంటి ఫలితమే కలుగుతుందని పండితులు చెఉబుతున్నారు.

విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం :  ఈ నెల విష్ణుమూర్తి కి ప్రీతికరం కాబట్టి.. ఏకాదశి తిథులలో కాని.. పౌర్ణమి తిథులలో కాని వయోవ్రతాన్ని ఆచరించి.. విష్ణుమూర్తిని పూజించి..ఆవుపాలతో తయారు చేసిన పాయసాన్ని నివేదన సమర్పించాలి. ఇలా  చేయడం వలన గత జన్మల్లో చేసిన పాప కర్మల నుంచి విముక్తి కలగడమే కాకుండా ఏడాదంతా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అన్ని విధాలుగా శుభం కలుగుతుందని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. 

గణపతి, పార్వతి ఆరాధన: పుత్ర సంతానం కోసం ఎదురు చూసే వారు ఈ నెలలో  ..పుత్ర గణపతి వ్రతం..  ఆచరించి గణపతిని పూజిస్తే..  అబ్బాయి పుట్టే యోగం కలుగుతుంది. శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమి రోజు పార్వతీదేవిని పూజిస్తే వివాహ, దాంపత్య సమస్యలు తొలగిపోతాయంటున్నారు పండితులు.

అమలక ఏకాదశి :  ఫాల్గుణమాసం.. శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు.  ఇది చాలా అత్యంత శక్తిమంతమైన రోజు.  ఆ రోజున ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి.. 108 ప్రదక్షిణలు చేయాలి.  ఇలా చేయడం వలన విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది.  అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలకు విముక్తి కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

పౌర్ణమి రోజున చేయాల్సిన పూజ: పురాణాల ప్రకారం  పాల్గుణమాసం.. పౌర్ణమి రోజున మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగింది.  అందుకే శివాలయాల్లో ఆ రోజున శివ పార్వతుల కళ్యాణం చేస్తారు.  ఇలా కళ్యాణం చేయించినా.. కళ్యాణ తంతును భక్తి శ్రద్దలతో చూసినా అన్ని రకాలుగా శుభఫలితాలు వస్తాయి.  పౌర్ణమి రోజున శివారాధన, ఈశ్వరుడిని తుమ్మిపూలతో పూజించడం, శివ సంబంధమైన స్తోత్రాలు పఠించడంద్వారా  ప్రయోజనాలను అందిస్తుంది. మనం జరుపుకునే హోలీ పండుగ కూడా ఇదే పర్వదినం.

సీతాష్టమి.. : ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమిని ..సీతాష్టమి.. అంటారు. సీతాదేవి జనక మహారాజుకు లభించిన రోజు ఇది. ఆ రోజు సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య విభేదాలు తొలగిపోతాయి. 

ఫాల్గుణ మాస అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున ఏ దానం ఇచ్చినా సంవత్సరం పాటు గ్రహ దోషాలు తొలగిపోయి ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయి.

ఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం  ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనెలను కలిపి గానీ, విడివిడిగా గానీ శివుడికి అభిషేకం చేస్తే...  ఈ మాసం పూర్తయిన 90 రోజుల్లోనే సర్వ సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.