హిందూ మతంలో పుష్య పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తిల ప్రత్యేక ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున స్నానాలు, దాతృత్వం, పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2026లో జనవరి 3న పుష్య పౌర్ణమి వచ్చింది. పురాణాల ప్రకారం ఆరోజు కొన్ని నియమాలు పాటిస్తే తిండి.. బట్ట.. డబ్బుకు లోటుండదని పండితులు చెబుతున్నారు. మరి ఆ రోజు (2026 జనవరి 3)న ఏమేమి చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
పుష్య మాసం పౌర్ణమి రోజున ( 2026 జనవరి 3) శ్రీ మహా విష్ణువు, లక్ష్మిని పూజించడం వలన ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో ఆనందం లభిస్తుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సుఖ సంతోషాలు కూడా మీ సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య నిపుణులు తెలిసిన వివరాల ప్రకారం జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు ఆ రోజున (2026 జనవరి 3)తెల్లటి వస్తువులను దానం చేయాలి. బియ్యం, పాలు, చక్కెర, తెల్లటి వస్త్రాలు, వెండి వస్తువులు వంటివి పేదలకు.. బ్రాహ్మణులకు దానం చేయడం మేలు జరుగుతుంది. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
పుష్య పూర్ణిమ రోజున ఆవునెయ్యితో దీపం వెలిగించి విష్ణు సహస్రనామం చదివి.. తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
పుష్య పౌర్ణమి ( జనవరి 3 వ తేదీన) సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. అనంతరం స్నానాది కార్యక్రమాలు గావించాలి. లక్ష్మీ, విష్ణు పూజలు చేయాలి. అవసరమైన వారికి దానం చేయడం.. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మొత్తంగా పుష్య పౌర్ణమి రోజున శుభాచారాలను పాటిస్తే సంవత్సరం పొడవునా సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ ఏడాది ( 2026) పుష్య పౌర్ణమి శనివారం ( జనవరి 3) వచ్చింది . శనివారం శనిభగవానుడికి చాలా ఇష్టం. ఈ రోజున శనికి తైలాభిషేకం, నువ్వులు–బెల్లం దానం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నువ్వులు, బెల్లం చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుతాయి .. ఇదే దీని శాస్త్రీయ కోణం.గరుడ పురాణం ప్రకారం నాభి స్థానం శని స్థానం. ఇది మానవుని శరీరంలోని అత్యంత శక్తివంతమైన ప్రదేశం. కాబట్టి ఈ మాసంలో మనస్సు, శరీరం, శక్తి అన్నీ సంతులిత స్థితిలో ఉంటాయి.
