ఆధ్యాత్మికం.. దేవాలయాలకు..టెక్నాలజీకి ఉన్న సంబంధం ఇదే.. !

ఆధ్యాత్మికం..  దేవాలయాలకు..టెక్నాలజీకి ఉన్న  సంబంధం ఇదే.. !

నేటి యూత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు.  ఏదో కొత్తగా కనిపెట్టారంటూ గొప్పలు చెబుతున్నారు.  కాని నేడు వాడుతున్న టెక్నాలజీ పూర్వకాలంలో రుషులు.. మునులు మనకు పురాణాల ద్వారా అందించారు.  దానికి కొత్త రూపు దిద్ది ప్రచారం చేస్తున్నారు. అసలు పురాణాల్లో సాంకేతిక గురించి ఏముంది.. ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెబుతున్నారు.. దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి..  తరంగాలకు.. టెక్నాలజీకి సంబంధం ఏమిటి.. మొదలగు విషయాలను  ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .  .

సనాతన హిందూ సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక ఉన్న రహస్యాలేంటి..  అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీని దేవాలయ నిర్మాణంలో ఉపయోగించారు. 

దేవాలయ దర్శనం :  దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు.  ఎడమవైపు నుండి (Clockwise Direction) ప్రదక్షిణలు చేస్తారు. ఎవ్వరూ అందుకు యాంటీక్లాక్ వైపు నుండి చేయరు. అలా ఎందుకు తిరుగుతారంటే.. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది.  ఇవి మన బాడీలోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. అందుకే దేవాలయంలో ప్రదక్షిణాలు చేయాలి అనే నియమాన్ని పండితులు వెలుగులోకి తీసుకొచ్చారు.

తరంగాలు కలిసే చోట : దేవాలయంలో మూల విరాట్ ను స్థాపించే ప్రదేశాన్ని పండితులు అనేక విధాలుగా పరిశీలించి నిర్ణయిస్తారు.  తరంగాలు ఎక్కడ ఏర్పడుతాయో పలు ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు.  భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ ...  విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడ తరంగాలు ఏర్పడుతాయి.  అక్కడే దేవాలయం లోని మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి...

మంత్రాలు : ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. అయితే ఈ మంత్రాలు ఎందుకు చదువుతారనే విషయం చాలా మందికి తెలియదు. పూజారులు మంత్రాలు ఎందుకు చదువుతారంటే.. అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. వాటిని శ్రద్దగా విని.. వాటి అర్దాన్ని తెలుసుకున్న వారు కూడా అనుభూతితో ఉత్తేజం చెందుతారు. 

►ALSO READ | ఆధ్యాత్మికం: శివుడిని కార్తీకంలోనే కాదు.... శ్రావణంలో కూడా పూజించాలి... ఎందుకో తెలుసా..!

బంగారానికి .. తరంగాలకు సంబంధం : దేవాలయాలకు వెళ్లేటప్పుడు మన పెద్దలు మంచి ఆభరణాలు వేసుకోమని చెబుతూ ఉంటారు.  వీటి ద్వారా మన ఆడంబరాలను చూపించడానికి అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయి...

గర్భగుడి : హిందూ దేవాలయాల్లో  గర్భగుడులు ఉంటాయి. ఈ గర్భగుడి ఎప్పుడూ ఒక వైపుకు మాత్రమే ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే గర్భగుడిలో ఎదురుగా ఉండకుండా ఒకవైపుకే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు.

తడిబట్టలు :  కొంతమంది  దేవాలయాలకు తడి బట్టలతో వెళ్తుంటారు. దీన్ని మడి ఆచారం అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తడి బట్టలకు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. దీని వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయని సైన్సు ద్వారా తెలుస్తుంది...