ఆధ్యాత్మికం: శివుడిని కార్తీకంలోనే కాదు.... శ్రావణంలో కూడా పూజించాలి... ఎందుకో తెలుసా..!

ఆధ్యాత్మికం: శివుడిని కార్తీకంలోనే కాదు.... శ్రావణంలో కూడా పూజించాలి... ఎందుకో తెలుసా..!

శ్రావణమాసంలో మహాలక్ష్మీదేవిని పూజిస్తారు.  అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని భక్తులు నమ్ముతుంటారు.  పరమేశ్వరుడికి కార్తీక మాసం తరువాత అత్యంత ఇష్టమైన మాసం శ్రావణమాసం. అందుకే శివుడిని శ్రావణమాసంలో కూడా పూజించాలని పండితులు చెబుతున్నారు. 

శ్రావణ మాసంలో  పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయడం వలన  జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయి.  కోరిన కోర్కెలు నెరవేరడమే కాకుండా.... అనేక బాధల నుంచి పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. రుద్రాభిషేకం చేసే సమయంలో...  ఓం నమో భగవతే రుద్రాయ.. ఓం నమః శివాయ అని స్మరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయడం మోక్షం లభిస్తుంది.  జన్మజన్మల పాపాలు నశించడమే కాకుండా... వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని  విశ్వసిస్తారు. 

 సకల దేవతలు శివునిలోనే ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందువలన  శివునికి రుద్రాభిషేకం చేస్తే  సకల దేవతల ఆశీస్సులు ఉంటాయి.  కాలసర్ప దోషం, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం, దీర్ఘాయువు, దీర్ఘకాలిక ఆరోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తో పాటు అన్నీ విధాలుగా సంపద, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

►ALSO READ | Blood Sugar : ఇంట్లోనే మధుమేహానికి చెక్.. ఈ సహజసిద్ధమైన మూలికలతో సంపూర్ణ ఆరోగ్యం!

శ్రావణ మాసంలో ఓం నమ:శివాయ: అంటే చాలు ...  అవి అనంత ఫలితాలను ఇస్తుంది. ఈ  మాసమంతా  నేలపై పడుకోవడం , బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. శ్రావణమాసంలో  ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు...  ఈ మాసంలో చేసే నమస్కారములు, ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయట.

శ్రావణ మాసంలోని వ్రతాలు.. పూజలు  శ్రద్ధగా చేసిన వారు పరమేశ్వరునికి  అత్యంత ప్రియులుగా ఉంటారని .. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు.