ఆధ్యాత్మికం : భక్తిలో భయం ఉండాలా.. బానిసగా ఉండకూడదా.. వైరాగ్యంతో వచ్చే లాభనష్టాలు ఏంటీ..?

ఆధ్యాత్మికం : భక్తిలో భయం ఉండాలా.. బానిసగా ఉండకూడదా.. వైరాగ్యంతో వచ్చే లాభనష్టాలు ఏంటీ..?

కోరికలు తీర్చమని దేవుడికి దండం పెడతారు. కొబ్బరికాయ కొడతారు. ఇంట్లో దీపారాధన చేసి పూజిస్తారు. గుడికెళ్లి దర్శనం చేసుకుని కష్టాలన్నీ తీర్చమంటారు.  ఏదన్నా పొరపాటు జరిగితే అయ్యో తప్పు జరిగింది..  స్వామీ తెలియక చేశాం. క్షమించు' అని చెంపలేసుకుని వేడుకుంటారు. అంటే, భక్తులకు దేవుడంటే భక్తితో పాటు భయం కూడా ఉందనే కదా..! 

అందరి కష్టాలు తీర్చే దేవుడంటే ఎందుకు భయపడాలి..? అసలు దేవుడంటే ఉండాల్సింది.. భయమా.. భక్తా.. దేవుడిపై ఉన్న భయం పోవాలంటే ఏం చేయాలి.. దేవుడు భక్తులను శిక్షిస్తాడా.. భయంలేకుండా భక్తితో దేవుడిని ఎలా ఆరాధించాలి.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు  ఉపనిషత్తుల్లో సమాధానాలున్నాయి

దేవుడు, దేవుడిని కొలిచే భక్తుడు ఒకటేనా. అంటే ఒకటే అని చెప్తాయి ఉపనిష్తులు.  "ఎట్లా అవుతారు? భక్తులు దేవుళ్లు అయితే ఇక్కడెందుకుంటారు? పూజలెందుకు చేస్తారు? పిచ్చి ప్రశ్నలు మానుకో' అంటారు. చాలామంది. కానీ భక్తులు నిజమైన భక్తితో దేవుడిని చేరుకోవడమే కాదు. దేవుడిగా కూడా మారొచ్చట. అదెలా అంటే.. ఉపనిషత్తుల్లో వివరంగా చెప్పారు. 
ఎప్పుడైతే మనిషి తనను తాను శుద్ధ బ్రహ్మస్వరూపం అనుకుంటాడో,, అప్పుడు అతడిలో దేవుడంటే ఉన్నభయం తొలగిపోతుంది. అప్పుడు దేవుడు వేరు, నేను వేరు అనుకోడు. అంతా దేవుని సృష్టి అనుకుంటారు. దేవుడు సృష్టించిన సృష్టిలో తేడాలుండవు కాబట్టి. "నేను.. దేవుడు సమానం అని భావించుకుంటాడు. అని చెప్తాయి. 

ALSO READ | ఆధ్యాత్మికం : ఙ్ఞానయోగం గొప్పదా.. కర్మ యోగం గొప్పదా.. ఈ రెండింటిపై శ్రీకృష్ణుడు చెప్పి క్లారిటీ ఇదే..!

మనిషిలో దేవుడంటే ఉండే భయానికి, భయం లేకపోవడానికి కారణం తనను తాను భక్తుడు దేవుడిగా భావించుకోలేకపోవడమన్నమాట. అలాగని భక్తుడు కేవలం దేవుడిని అనుకుంటే సరిపోదు. కరుణ, ప్రేమ, మంచితనంతో ప్రవర్తించాలి

బానిస కాకూడదు

భక్తులు దేవుడికి పూజలు చేయడం. సమస్కారాలు పెట్టడం..గుళ్లు గోపురాలంటూ తీర్థయాత్రలు చేయడం వంటివన్నీ దేవుడి మీదున్న భక్షితో కాదు, భయంతో, అదెలాగంటే..? దేవుడిని పూజించకపోతే కష్టాలు పెడతారు. పనులకు ఆటంకం కలిగిస్తాడు అనే భయం వల్లే భక్తులు అలాంటివన్నీ చేస్తారని కొందరు అంటారు. అవన్నీ బానిసత్వాన్ని సూచించేవని, దేవుడు, నేను వేరు అనే భావంతోనే అది చేస్తారని బృహదారణ్యకోపనిషత్తు చెప్పంది. 

అలాగనీ  దేవుడిని కొలవాల్సిన అవసరం లేదని కాదు. దేవుడంటే భయం ఉండకూదదని మాత్రమే. విష్ణు సహస్రనామాలలో భయం కలిగించేవాడు (భయకృత్) భయం తొలగించేవాడు(భయనాశన:) అని కూడా ఉంది. భయంతో దేవుడికి పూజలు చేస్తున్నారు అంటే, దేవుడి తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా పూజిస్తున్నారన్నమాట. 

నిజానికి దేవుడు ఎప్పుడూ ఎవర్నీ భయపెట్టడు మనిషే భయం కల్పించుకుంటాడు. ఆ భయాన్ని దేవుడు 
తొలగిస్తాడనుకుంటాడు. అది భ్రమ మాత్రమే అందుకే పూజ, జపం, నమస్కారం లాంటివి దేవుడిపై ప్రేమతో, భక్తితో చేయాలి. భయం అనే బానిస మనస్తత్వంతో కాదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

సముద్రంలో అలలా.. 

దేవుడు... భక్తుడు వేరుకాదు అనుకుంటే సరిపోదు. లోపలున్న గర్వాన్ని పోగొట్టుకోవాలి. దేవుడు సృష్టిలోని ప్రతీ జీవిని ఎలా సమానంగా చూస్తాడో భక్తులు అలా చూడాలి. సమాజంలో జీవిస్తున్నప్పుడు... సమాజంతోపాటు నడుచుకోవాలి. ధర్మాలు పాటించాలి, కర్తవ్యాలు నిర్వహించాలి. 'భగవద్గీత'లో కృష్ణుడు. 'నేను అవతార పురుషుడినైనా ధర్మబద్ధంగా నడుచుకుంటాను. ఏ కర్తవ్యం లేకపోయినా... లోకాన్ని మంచి మార్గంలో పెట్టడానికి లోకంలో ఉన్న ధర్మాలన్నీ పాటిస్తున్నాను. నేను అలా చేయకుండా ఉంటే, నన్ను పూజించే భక్తులే కాదు ..అందరూ లోక ధర్మాన్ని వదిలిపెట్టి, ఎవరికి నచ్చినట్లు వాళ్లు ప్రవర్తిస్తారు. దాంతో సమాజం తప్పుదోవ పడుతుంది అని చెప్తాడు. 

మనిషి సముద్రం లాంటి వాడు. కానీ అలలా మాత్రమే బతకాలి సముద్రంలో కలిసిపోయి అవసరం అయినప్పుడు ఒడ్డుకు వస్తూ మళ్లీ వెనక్కుపోతూ జీవించాలి. అంతేకానీ గర్వం పనికిరాదు. ఉప్పు ..సముద్రంలో కలిసి తన రూపాన్ని, రుచిని కోల్పోతుంది. కానీ దాని స్వభావం మాత్రం సముద్రంలో ఎప్పటికీ ఉంటుంది. అహం బ్రహ్మోస్మి' అనే మాట భక్తులు అర్థం చేసుకుని, అలాగే జీవించాలి. 

వైరాగ్యంతో భయం పోతుంది 

ఈ రోజుల్లో ఎక్కువ సుఖపడితే రోగాలొస్తాని భయం ..ఎక్కువ సంపాదిస్తే సీబీఐ వాళు రైడ్ చేస్తారని భయం... వయసు పెరుగుతున్న కొద్దీ ముసలోళ్లం అవుతామన్న భయం... ఫస్ట్​  మార్కులు తెచ్చుకుంటే, వచ్చే పరీక్షలో మరొకరు ముందుంటారన్న భయం. ఇలాంటి భయాలన్నీ పోవాలంటే ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి తప్ప.. ఒక్కరి దగ్గరే ఉండవని తెలుసుకోవాలి. అప్పుడే వాటిపై ఇష్టం తగ్గుతుంది. వైరాగ్యంతో ఉండాలని చెప్పేది ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ల గురించే అలాంటి వాళ్ల వెంట సంతోషం ఎప్పుడూ ఉంటుంది.. భయం ఉండదు.

 తైత్తిరీయోపనిషత్తులో పరబ్రహ్మ అనే పదానికి 'సత్యం, చైతన్యం" అనే అర్థాలు చెప్తారు. ఎవరికి వాళ్లు చైతన్యవంతంగా, సత్యంతో జీవించినప్పుడు భయం ఉండదు. అలా ఉండలేని వాళ్లు భయంతోనే బతుకుతూ ఉంటారు. ప్రతి చిన్నవిషయానికి భయపడతారు. మనిషి తనను తాను తెలుసుకుంటూ, లోపాలు: సరిచేసుకుంటూ పోతే భయం దానంతట అదే పోతుంది. దీనినే ఆధ్యాత్మిక సాధనని ఉపనిషత్తులు చెప్తాయి. 

కోరికలు వదిలేస్తేనే.. 

భక్తి అంటే కేవలం దేవుడిని పూజించడం మాత్రమే కాదు. 'భక్తి' పదానికి 'భాగం' అనే అద్దం కూడా ఉంది. అంటే, రెండుగా విడిపోవడన్నమాట భక్తులు ఎప్పుడూ దేవుడు ... తాము వేరు అనుకోకూడదు. గుడిలో ఎదురుగా దేవుడిని చూస్తున్నాను అనుకున్నట్లే తమనఉ  కూడా భగవంతుడిగా భావించుకోవాలి. అప్పుడే స్వచ్ఛమైన మనసుతో భగవంతుడిని పూజించగలుగుతారు.  కోరికలు కోరడం మానేసి మంచి పనులు చేయడం మొదలు మడతారు. అప్పుడే భయం పోయి, ఆ మంచి పనుల తాలూకు సంతోషం కలుగుతుంది.

-–వెలుగు,లైఫ్​–