ఆధ్యాత్మికం :  జీవితం అంటే ఏమిటి..నిజమైన శాంతి... ఆనందం ఎప్పుడు కలుగుతుంది...!

ఆధ్యాత్మికం :  జీవితం అంటే ఏమిటి..నిజమైన శాంతి... ఆనందం ఎప్పుడు కలుగుతుంది...!

తినడం, త్రాగడం, నిద్రించడం కంటే జీవితంలో ఒక ఉన్నతమైన ధ్యేయము లేదా? మానవ జన్మ పొందడం కష్టం. అందువల్ల ఈ జన్మలో భగవానుడిని పొందడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. కాలం రాజులను, మంత్రులను . ప్రతి ఒక్కరినీ కబళిస్తుంది. యోగ సాధనలో చురుకుగా ఉండండి, అప్పుడు మీరు పరమ ఆనందాన్ని పొందుతారు. ఇంద్రియాల  తాత్కాలిక సుఖాల కోసం మరియు ఈ లౌకిక జీవితం కోసం మీ సమయాన్ని వృధా చేస్తే మీరు నిజమైన శాంతిని ఆశించగలరా?  సమయాన్ని పోరాటాలు, కలహాలు లేదా పనికిమాలిన కబుర్లలో వృధా చేస్తే నిజమైన ఆనందాన్ని పొందగలరా? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..!

జీవించడం అంటే ఆదర్శం .. లక్ష్యం కోసం పోరాడటం.  మనస్సును ... ఇంద్రియాలను జయించాలి. అప్పుడే నిజమైన శత్రువులను.. అంతర్గత శత్రువులను జయించగలుగుతారు.  పరిసరాలను, పాత చెడు అలవాట్లను, పాత చెడు సంస్కారాలను, చెడు ఆలోచనలను , చెడు వాసనలను జయించాలి.  విరోధమైన, చీకటి, చెడు శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ క్షీణత శక్తులను ఎదిరించాలి.

 జీవితం ఆత్మ సాక్షాత్కారం కోసమే ఉద్దేశించబడింది.  క్రమం తప్పకుండా సంకీర్తన చేసి, ఆత్మానందాన్ని అనుభవించాలి. నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించి,  హృదయాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.  అప్పుడే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. జీవితమనే దైనందిన పోరాటంలో మీకు దెబ్బలు, ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, మనస్సు సక్రమంగా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లుతుంది. అప్పుడు వివేకం, వైరాగ్యం, లౌకిక విషయాలపై విరక్తి, మోక్ష కాంక్ష కలుగుతాయి. గాఢ ధ్యానాన్ని అభ్యసించండి. జీవితం చిన్నది. కాలం గడిచిపోతుందనే విషయాన్ని గ్రహించాలి

 జీవితంతో విసిగిపోయాను అనో, ఈ లైఫంటే బోర్ కొడుతోంది అనో చాలామంది నోట వినిపించే మాటే.
 నిజానికి ఈ మాట అనడానికి వీలేలేదు. ఎందుకంటే, వినోద సాధనాలు విరివిగా ఉన్నాయి. అయినా, జీవితం విసుగు పుట్టిస్తోందని చాలా మంది ఫీలవుతుంటారు.   ఈ జీవితానికి అర్థం ఏముంది అని నిరుత్సాహ పడుతుంటారు. కాని జీవితంలో మనం చేసే ప్రతి పనికీ అర్ధం ఉన్నప్పుడు... మన జీవితానికి మాత్రం అర్థం లేకుండా ఎలా పోతుందనే విషయాన్ని గ్రహించాలి.  మరణం కంటే జీవితం మీదే ఇష్టం ఎక్కువ మనకు. కాకపోతే ప్రశాంతంగా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతుంటారు.

మన జీవితానికి అర్థం తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. దేవుణ్ని తెలుసుకుని, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అర్థవంతమైన జీవితం అంటే ఏంటో బోధపడుతుంది.  జీవితానికి ఒక అర్థమంటూ ఉందని  అనేక పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు  దేవునికి ఎప్పుడూ దూరం కాము అనే విషయం అర్దమవుతుంది. 

ఆధ్యాత్మిక జీవితం కేవలం వట్టి మాటలు కాదు. అది కేవలం ఒక అనుభూతి కాదు. అది ఆత్మలో వాస్తవంగా జీవించడం. అది కల్మషం లేని ఆనందం, పరమానందంతో కూడిన ఒక దివ్యమైన అనుభవం. అది పరిపూర్ణతతో కూడిన జీవితం. అక్కడ మరణం గానీ, కోరిక గానీ, దుఃఖం గానీ, బాధ గానీ, సందేహం గానీ, భ్రమ గానీ లేని శాశ్వత శాంతి, అనంతమైన ఆనందం గల ఒక ప్రదేశం ఉంది. నిరంతర ఆనందం, సంతోషంతో నిండిన ఆ అమర నిలయాన్ని చేరుకోవాలి.

ఒక వస్తువు తాను దేనికోసం తయారు చేయబడిందో దానికి పరిపూర్ణంగా ఉపయోగించబడినప్పుడు మాత్రమే అనుకున్న ఫలితం వస్తుంది, మనిషి జీవితమూ అంతే...  దైవం కోసం జీవించినప్పుడు.. మన జీవితాన్ని పరమాత్ముడి సేవకు అంకితం చేసినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి.  అప్పుడు జీవితంలో విసుగు అనే పదానికి స్థానం లేకుండా పోతుంది. ఇక్కడ దైవం అంటే ఎవరో కాదు... సాటి మానవుడే వం. ప్రతి ప్రాణీ దైవమే అని గుర్తించాలి.  అలా జీవించినప్పుడే నిజమైన శాంతి... ఆనందం ఎప్పుడు కలుగుతుంది..