ఎయిర్ ఇండియా సీఈఓకి డీజీసీఏ షోకాజ్ నోటీస్

 ఎయిర్ ఇండియా సీఈఓకి డీజీసీఏ షోకాజ్ నోటీస్

ముంబై/ న్యూఢిల్లీ: దుబాయ్–-ఢిల్లీ విమానంలో పైలట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌‌‌‌‌‌‌‌పిట్‌‌‌‌‌‌‌‌లోకి అనుమతించడంపై రిపోర్ట్​ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌‌‌‌‌‌‌‌బెల్ విల్సన్‌‌‌‌‌‌‌‌కు  డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది.  ఈ ఏడాది ఫిబ్రవరి 27 న ఈ ఘటన జరిగింది.

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ క్వాలిటీ ఫంక్షన్స్ హెడ్ హెన్రీ డోనోహోకి షోకాజ్ నోటీసు కూడా జారీ అయింది. కాక్‌‌‌‌‌‌‌‌పిట్‌‌‌‌‌‌‌‌లోకి మహిళా స్నేహితురాలిని పైలట్ అనుమతించడంపై విమానంలోని క్యాబిన్ సిబ్బంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి ఫిర్యాదు చేశారు.  రెగ్యులేటర్ భద్రతా సూచనలను ఉల్లంఘించడం, ఘటన వివరాలను సకాలంలో డీజీసీఏకు తెలియజేయనందుకు ఎయిర్ ఇండియా సీఈఓ, ఫ్లైట్ సేఫ్టీ హెడ్‌‌‌‌‌‌‌‌కు ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు జారీ చేశారు.