స్పైస్‌జెట్ సంస్థకు  కార్గో లైసెన్స్ నిలిపేసిన DGCA

స్పైస్‌జెట్ సంస్థకు  కార్గో లైసెన్స్ నిలిపేసిన DGCA

ప్రముఖ స్వదేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు విమానయాన శాఖ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించడంతో లైసెన్స్ నిలిపివేసింది DGCA.  ఇండియాలో విమానయాన సేవల పర్యవేక్షణ, నియంత్రణ, అనుమతి అన్నీ విమానయాన నియంత్రణ సంస్థ  DGCA చేతిలో ఉంటుంది. వివిధ విమానయాన సంస్థల పనితీరు, నిబంధనల్ని ఎంత వరకు పాటిస్తున్నాయనేది DGCA పర్యవేక్షిస్తుంటుంది. ఏదైనా సంస్థ నిబంధనల్ని ఉల్లంఘిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది.

ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పైస్‌జెట్‌పై DGCA చర్యలకు దిగింది. ప్రమాదకర వస్తువుల్ని నిబంధనలకు విరుద్ఘంగా స్పైస్‌జెట్ సంస్థ రవాణా చేసిందనేది ఆ సంస్థపై ఉన్న ఆరోపణ. ఈ ఆరోపణలపై స్పైస్‌జెట్ సంస్థకు చెందిన కార్గో లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నెలరోజుల పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్టు DGCA తెలిపింది.

లిథియం-అయాన్ బ్యాటరీలతో పాలు ప్రమాదకరమైన వస్తువుల్ని తీసుకెళ్లేందుకు స్పైస్‌జెట్ సంస్థకు అనుమతి లేదు. దేశీయ, విదేశీ విమానాలను ఆ వస్తువుల రవాణాకు అంగీకరించదు. నిబంధనలకు విరుద్ధంగా స్పైస్‌జెట్ సంస్థ ప్రమాదకర వస్తువుల్ని రవాణా చేసినట్టు తేలడంతో DGCA కార్గో లైసెన్స్ నిలిపివేసింది.

 ఈ విషయంపై స్పైస్‌జెట్ సంస్థ స్పందించింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులని చెప్పడం కారణంగానే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చింది. ఆ షిప్పర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్టు స్పైస్‌జెట్ తెలపింది. DGCA నిబంధనల ప్రకారం ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కల్గించే వస్తువుల్ని వెంట తీసుకెళ్లకూడదు. ఈ ఏడాది వార్షిక ఆదాయంలో 30 శాతం లాభాన్ని స్పైస్‌జెట్ సంస్థ కార్గో ద్వారానే సాధించింది.