
మావోయిస్టుల కంచుకోట భద్రాచలం ఏజెన్సీలో రాష్ట్ర పోలీస్‍బాస్, డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం పర్యటించారు. గోదావరి పరివాహక జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం సరిహద్దు జిల్లాలైన ములుగు, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసలు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమర్ధవంతంగా పనిచేస్తున్నాని అధికారులను మెచ్చుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, సామాన్యులకు ఇబ్బందులు కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి హరిభూషణ్, ఆయన భార్య శారద చత్తీస్‍గఢ్ దండకారణ్యం నుంచి గోదావరి దాటి వచ్చి పార్టీ కార్యకలాపాలను పెంచేందుకు పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల అధికార పార్టీ ఎంపీటీసీ కిడ్నాప్, హత్య చేశారన్నారు. అలాగే గిరిజనులను తమవైపు తిప్పుకొని తిరిగి రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. వారి ప్రయత్నాలు నిలువరించేందుకు ఇటీవల కొన్ని గిరిజన సంఘాల, పార్టీల అనుబంధ సంఘాల ఆందోళనలపై దృష్టి సారించి, ఆంక్షలు విధించామన్నారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టి వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్‌తో పాటు కేంద్ర నిఘావర్గాల సహకారంతో స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమీక్షలో గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీపీ కే శ్రీనివాసరెడ్డి, నార్త్ జోన్‍ఐజీపీ వై నాగిరెడ్డి, ఐజీపీ ప్రభాకర్‍రావు, ఖమ్మం కమిషనర్ తఫ్సీర్‍ఇక్బాల్, భద్రాద్రి కొత్తగూడె జిల్లా ఎస్పీ సునీల్‍దత్ తదితరులు పాల్గొన్నారు.