వేల వాహనాలు సీజ్.. కోట్ల రూపాయలు ఫైన్

వేల వాహనాలు సీజ్.. కోట్ల రూపాయలు ఫైన్

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కోవిడ్ నియంత్రణకు ఆంక్షలు కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేస్తామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ చెక్‌పోస్ట్ వద్ద డీజీపీ స్వయంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకై ప్రజలు పోలీస్ వారికి సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ని పెట్టడం జరిగింది. కరోనాను జయించాలంటే.. లాక్‌డౌన్ శరణ్యం. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు పరుస్తున్నారు. అంబులెన్స్ సర్వీసులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పంపిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా లేదా అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి చేయడం జరిగింది. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి.. వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వేల వాహనాలను సీజ్ చేసి.. కోట్ల రూపాయలు ఫైన్ వేశాం’ అని ఆయన తెలిపారు.