మాస్క్‌‌ రూల్ స్ట్రిక్ట్‌‌ చేయండి.. డీజీపీ ఆదేశాలు

మాస్క్‌‌ రూల్ స్ట్రిక్ట్‌‌ చేయండి.. డీజీపీ ఆదేశాలు
  • పోలీసు​లకు డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా రూల్స్‌‌ స్ట్రిక్ట్‌‌గా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రూల్స్ పాటించని వారిపై కేసులు పెట్టాలన్నారు. శుక్రవారం ఆయన పోలీస్‌‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, ఎస్‌‌హెచ్‌‌వో లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. కరోనా కేసుల కంట్రోల్‌‌ కోసం ప్రతీ పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌ పనిచేయాలని ఆదేశించారు. కరోనాను 100 శాతం కంట్రోల్‌‌ చేసేందుకు గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

‘నో మాస్క్​ నో ఎంట్రీ’ అమలు చేయాలి
ఫేస్‌‌ మాస్కులు, ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌పై స్పెషల్‌‌ ఫోకస్ పెట్టాలన్నారు. పబ్లిక్‌‌ ప్లేసెస్‌‌లో మాస్క్‌‌రూల్‌‌ కఠినంగా అమలు చేయాలని చెప్పారు. మాల్స్, వైన్స్‌‌, పబ్బులు, హోటల్స్‌‌, రెస్టారెంట్లు, కిరాణషాపులు, పెట్రోల్ బంకుల్లో మాస్క్‌‌ తప్పనిసరి చేయాలని అన్నారు. ‘‘నో మాస్క్‌‌ నో ఎంట్రీ’’ రూల్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. వ్యాపారులకు కరోనా రూల్స్‌‌పై మరింత అవగాహన కలిగించాలని అన్నారు. మాస్క్‌‌లు ధరించని కస్టమర్లను అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రూల్స్ పాటించని వారిపై యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

ప్రజల్లో అవేర్​నెస్ తీసుకురావాలి
గ్రామస్థాయిలో యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక టీమ్స్‌‌తో కలిసి అవగాహన కల్పించాలన్నారు. కళా బృందాలతో కరోనా కట్టడిపై ప్రోగ్రామ్స్‌‌ చేయించాలన్నారు. ప్రతీ ఒక్కరు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో వెల్ఫేర్ అసోసియేషన్స్‌‌తో కోఆర్డినేట్‌‌ చేసుకోవాలని చెప్పారు. జనం మాస్క్‌‌లేనిదే ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతీ పోలీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి
రాష్ట్ర పోలీస్‌‌ సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్‌‌ వ్యాక్సిన్‌‌ వేసుకోవాలని చెప్పారు. ఫ్రంట్‌‌లైన్‌‌ వారియర్స్‌‌గా వర్క్ చేస్తున్న హోమ్‌‌గార్డ్‌‌ నుంచి ప్రతీ పోలీస్‌‌ వ్యాక్సిన్‌‌ తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం కమిషనర్స్‌‌, జిల్లాల ఎస్పీ యూనిట్స్‌‌ స్పెషల్‌‌ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. వారం రోజుల్లో 95 శాతం వ్యాక్సినేషన్ కంప్లీట్‌‌ చెయ్యాలన్నారు.