- ముగిసిన సైబరాబాద్ పోలీస్ వార్షిక క్రీడోత్సవాలు
- విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్ల ప్రదానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సమర్థవంతమైన పోలీసింగ్‌కు స్పోర్ట్స్అవసరమని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన 8వ వార్షిక క్రీడలు, డ్యూటీ మీట్-2025 కార్యక్రమం గురువారం గచ్చిబౌలి సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ముగిసింది. డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు టీమ్‌వర్క్‌ను, లీడర్షిప్ను పెంపొందిస్తాయన్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతీ మాట్లాడుతూ.. 1,022 మంది సిబ్బంది క్రీడల్లో పాల్గొన్నారన్నారు.
మూడు రోజుల పాటు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, లాంగ్ జంప్, షాట్‌పుట్, చెస్, యోగా, బాడీ బిల్డింగ్ తదితర పోటీలు జరిగాయన్నారు. తమ సిబ్బందికి బ్యాడ్మెంటన్, టెన్నిస్ ఆడడానికి సౌకర్యాలు కల్పించామన్నారు. కాగా, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్ టీమ్విజేతగా నిలవగా, 100 మీటర్ల పరుగు పందెంలో పురుషుల విభాగంలో రమేశ్(సీఎస్‌డబ్ల్యూ) ఫస్ట్, వెంకటేశ్(సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) సెకండ్, విష్ణు(సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) థర్డ్ ప్లేస్‌లో నిలిచారు.
మహిళల విభాగంలో గాయత్రి(సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఫస్ట్, యమున(సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) సెకండ్, రేణుక (సీఎస్‌డబ్ల్యూ) థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా మౌంటెయిన్పోలీసింగ్ యూనిట్ టెంట్ పెగ్గింగ్, విమెన్ స్పెషల్ వింగ్ సైలెంట్ డ్రిల్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చివరకు ఫైర్‌వర్క్స్‌తో కార్యక్రమాన్ని ముగించారు. అంతకుముందు డీజీపీ ద కాప్ కెఫేను ప్రారంభించారు.
