సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

హైదరాబాద్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస రావు కోరారు. శుక్రవారం ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. మొదటి డోస్, బూస్టర్ డోస్ తీసుకోని వాళ్లు  కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధీలోని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాక్సిన్ వేయించుకోని పిల్లలకు వెంటనే వ్యాక్సిన్ వేయించాలని కోరారు.

వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫ్లూ లక్షణాలు ఉంటే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రజలు తమ పరిసరాల్లో మురికి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే దోమలు బాగా వృద్ధి చెంది... మలేరియా, డెంగ్యూ ప్రబలే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికొస్తే రాష్ట్రంలో మొదటి డోస్105 శాతం, రెండో డోస 100 శాతం పూర్తయిందన్నారు. కరోనా ఫోర్త్ వేవ్ కు దేశంలో ఛాన్స్ తక్కువేనని, అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని డీహెచ్ కోరారు.