‘ధమాకా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘ధమాకా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం ‘ధమాకా’. డిసెంబర్ 23న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘అల్లరి ప్రియుడు’ చిత్రంలో డ్రమ్స్ వాయించే చిన్న క్యారెక్టర్‌‌‌‌ చేసిన రవితేజను చూసి మాస్ మహరాజా అవుతాడని అప్పుడే అనుకున్నాను. అలాగే ‘పెళ్లి సందD’లో ఫ్లూట్ వాయించి ఆకట్టుకుంది శ్రీలీల.  నా పిల్లలు టాప్ పొజిషన్‌‌లో ఉన్నారంటే ఎంత ఆనంద పడతానో, రవి, శ్రీలీలను చూస్తుంటే కూడా అంతే ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ ‘ప్రసన్న కుమార్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. 

ఇలాంటి కొత్త వాళ్లు ఇంకా రావాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా.. నెక్స్ట్ లెవెల్‌‌కి వెళ్తుంది శ్రీలీల. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అంతా పాజిటివ్ పర్సన్సే ఉంటారు.. ఈ సంస్థలో నేను సినిమాలు చేస్తూనే ఉంటా. ‘ధమాకా’ మాస్ ఫీస్ట్ గ్యారెంటీ’ అన్నాడు. బ్యూటీఫుల్ టీమ్‌‌తో వర్క్ చేసినందుకు హ్యాపీ అంది శ్రీలీల. రవితేజ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నాడు త్రినాథరావు. ‘ధమాకా’తో పండుగలు ముందే మొదలవుతాయన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల.  దర్శకులు మారుతి, నందిని రెడ్డి, శ్రీవాస్, బీవీఎస్ రవి, సుధీర్ వర్మ, విజయ్ కనకమేడల, శ్రీనివాస్ అవసరాల, కృష్ణ చైతన్య, ఉపేంద్ర, వంశీ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. రైటర్ ప్రసన్న కుమార్, సముద్రఖని, హైపర్ ఆది, భీమ్స్ సిసిరోలియో, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు.