"ధమాకా" షూటింగ్ పూర్తి

 "ధమాకా" షూటింగ్ పూర్తి

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా'. ఇందులో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ మూవీకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాకీ పార్టు, పాటలతో సహా ధమాకా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వదిలారు మేకర్స్. 

రవితేజ మార్క్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. కథ మాటలు ప్రసన్న కుమార్, ఫోటోగ్రఫిని కార్తీక్ ఘట్టమనేని అందిస్తున్నారు. చిత్ర నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

తారాగణం: రవితేజ, శ్రీలీల
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
PRO: వంశీ శేఖర్