
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌పై అతడి మాజీ భార్య ధనశ్రీ వర్మ సంచలన ఆరోపణలు చేసింది. చాహల్ తనను మోసం చేశాడని.. మా పెళ్లైన రెండు నెలలకే ఈ విషయాన్ని తాను పసిగట్టానని చెప్పింది ధనశ్రీ. తాజాగా.. షో రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీకి డివోర్స్ ఇష్యూపై ప్రశ్న ఎదురైంది.
మీ వివాహ బంధం ఇక ముందుకు సాగదని మీరు ఎప్పుడు గుర్తించారని యాంకర్ ధనశ్రీని ప్రశ్నించింది. ఈ క్వచ్చన్కు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. తమ పెళ్లి అయిన రెండో నెలలోనే చాహల్ తనను మోసం చేస్తున్నట్లు గుర్తించానని.. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితంలో విబేధాలు వచ్చాయని.. ఇకపై కలిసి ముందుకు సాగలేమని అప్పుడే నిర్ణయించుకున్నామని తెలిపింది.
కాగా, చాహల్, ధనశ్రీ వర్మ 2020, డిసెంబర్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధంలో 2022లో మనస్పర్ధాలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకుని విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ALSO READ : అబ్బే మీరు మారరా.. మీకంటూ సొంత ఐడియాస్ ఉండవా..! సూర్యను కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా
ఇందులో భాగంగానే పరస్పర అంగీకారంతో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. 2025, మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. దీంతో చాహల్, ధనశ్రీ వర్మల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది.