ఆధ్యాత్మికం : ధనుర్మాసం ప్రారంభం.. శ్రీ కృష్ణ ప్రార్థనతో మోక్షానికి మార్గంగా మొదటి పాశురం

ఆధ్యాత్మికం : ధనుర్మాసం ప్రారంభం.. శ్రీ కృష్ణ ప్రార్థనతో మోక్షానికి మార్గంగా మొదటి పాశురం

ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై .   ద్రావిడ భాషలో.. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. మొదటి రోజు  ఈ కింద చెప్పిన పద్యం చదివిన తరువాత పాశురం చదువుకుంటారు. ధనుర్మాసం నెలరోజులు .. రోజుకొక పాశురం చొప్పున ఒక్కో పాశురం ఈ మాసమంతా చదవాలి.   ఇప్పుడు మొదటి రోజు చదవాల్సిన పాశురం గురించి తెలుసుకుందాం. . .

నీళాడుజ్గస్త్రనగితటి సుప్తముద్బోర్య కృష్ణం 
పారార్థ్యం స్వం శ్రుతికత శర సిద్ధమద్వాపయస్తీ 
స్వోచ్ఛిష్త్రాయాం ప్రజ నిగళితం యా బచాత్కృత్య భుజ్త్య్రే
 గోదా తస్మై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

అన్నయవల్ పుదువై యాండాళ్ అరజ్గర్యు
పన్ను తిరుప్పావై ఫల్ పదియం, ఇన్ని శైయాల్
 పాడిక్కొడుత్తాళ్ సబ్బామాలై పూమాలై 
శూడిక్కొరుత్త్రాళై చ్చొల్లు
శూడిక్కొరుత్త శుబర్ కొడియే తొల్​పావై
పాడియరుళ వల్ల పల్​పళాయాయ్, నాడి వీ 
వేబ్గిడపర్కెన్నై  విని యెన్ద ఇమ్మాత్త్రమ్,
నామ్ కడవా వణ్ణమే నల్గు.

మొదటి రోజు పాశురం

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో  నేలళైయీర్
శీర్​మల్​గుమాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్​ కాళ్​
కూర్​ వేల్​ ‌– కొడున్టొళలన్​ నస్త్రగోపన్​ కుమరన్​
ఏరార్​ న్త్రకణ్ణి యశోదైయిళ శెంజ్గమ్​
కార్​ మేని చ్చెంగళ్​ కదిర్​ మదియమ్బోల్​ ముగత్తాన్​
నారాయణవే సమక్కే పఱై దరువాన్​
పారోర్​ పుగళప్పడిన్త్రేలో రెమ్బావాయ్​..!

భావము: సంపన్నమైన గోకులంలో పుట్టిన గోపికలారా! మార్గశీర్ఘ మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి శూరుడైన నందగోపుని కుమారుడు. విశాలమైన నేత్రాలున్న యశోదకు బాల సింహము వంటి వాడు.  నల్లని మేఘము వంటి శరీరముతో, చంద్రునివటి ఆహ్లాదకరంగా, సూర్యునివలె తేజోవంతంగా ఉండే నారాయణుడే తప్ప, ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసనివి ఇచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లు, మార్గళి స్నానము చేయాలనుకునే వారంతా ఆలస్యం చేయకుండా శ్రీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నెలందరినీ ఆహ్వానిస్తోంది.

►ALSO READ | ధనుర్మాసం .. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టం.. బ్రహ్మదేవుడు.. నారదుడికి చెప్పిన రహస్యం ఇదే..!