'కెప్టెన్ మిల్లర్' గ్రాండ్ లాంచ్

'కెప్టెన్ మిల్లర్' గ్రాండ్ లాంచ్

తమిళ సూపర్ స్టార్ ధనుష్ లేటెస్ట్ గా `కెప్టెన్ మిల్లర్` అనే పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. 1930–1940 మధ్య కాలంలో జరిగిన పలు యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ ధనుష్ కు జోడీగా నటిస్తోంది. నివేదితా సతీష్ మరో పాత్రలో కనిపించనుంది.

ఇవాళ ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు మేకర్స్. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరోలు ధనుష్, సందీప్ కిషన్, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీష్, చిత్ర బృందం హాజరయ్యారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై టీ.జీ. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది.

కాగా, బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి భారీ సినిమాలకు పని చేసిన మదన్ కార్కీ ఈ మూవీ తమిళ వెర్షన్ కు డైలాగ్ లు అందిస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

తారాగణం: ధనుష్
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
సమర్పణ: T.G. త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
DOP: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: నాగూరన్
కళ: టి.రామలింగం
PRO: వంశీ–శేఖర్