కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’. టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, హిమాన్షు శర్మ, ఆనంద్ ఎల్ రాయ్ కలిసి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (2025 నవంబర్ 28న) వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అమర కావ్యం’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎమోషనల్ ఇంటెన్సిటీ కంటెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శంకర్ అనే పాత్రలో ధనుష్, ముక్తిగా కృతి సనన్ నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో ధనుష్‌కు ఇది మూడో సినిమా. గతంలో రాంఝానా, అత్రంగి రే తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
రామ్ v/s ధనుష్:
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తన కెరీర్ లోనే మోస్ట్ పర్సనల్ సినిమా అని, ఎప్పటినుంచో తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఇందులో ఉన్నాయని హీరో రామ్ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో గట్టి కొట్టాలని కసితో ప్రమోషన్స్లో వేగం పెంచుకొస్తూ ఆడియన్స్కి దగ్గర అవుతున్నాడు. ఇపుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి పోటీగా ధనుష్ మూవీ సైతం వస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఆసక్తి నెలకొంది.
అయితే, మంచి సౌండ్తో హీరో రామ్ ఊపు మీద ఉంటే.. ధనుష్ మాత్రం సైలెంట్గా సినిమా రిలీజ్ చేస్తున్నారు. కనీసం.. తన హిందీ డబ్బింగ్ మూవీ తెలుగులో 'అమరకావ్యం' అని ఒకటి ఉందని కూడా తెలుగు ఆడియన్స్కి తెలియదు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందనే సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే వరుస ఫెయిల్యూర్స్లో రామ్, వరుస విజయాలతో ధనుష్. ఇక.. యుద్ధం కోసం వెయిట్ అండ్ సి.. అనుకోవడమే!!! ఇకపోతే.. ధనుష్.. రాయన్, కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని మంచి జోష్ తో ఉన్నాడు.
