నాదే ఈ లోకమంతా.. ‘కుబేర’ టీజర్ చూశారా..? సినిమాలో నాగార్జున క్యారెక్టర్‌‌‌‌ ఇదే..

నాదే ఈ లోకమంతా.. ‘కుబేర’ టీజర్ చూశారా..? సినిమాలో నాగార్జున క్యారెక్టర్‌‌‌‌ ఇదే..

ధనుష్, నాగార్జున లీడ్ రోల్‌‌లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు.  జూన్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఆదివారం టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో  డ‌‌బ్బు, భావోద్వేగం, విలువ‌‌లు అనే కాన్సెప్ట్‌‌తో  ధ‌‌నుష్, నాగార్జున‌‌, జిమ్ స‌‌ర్బ్, ర‌‌ష్మిక పాత్రలను చూపిస్తూ  సినిమాపై ఆసక్తిని పెంచారు.

ఇందులో ధనుష్​ డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపిస్తుండగా,  స‌‌మ‌‌స్యల్లో ఇరుక్కున్న ప్రభుత్వ అధికారిగా నాగార్జున క్యారెక్టర్‌‌‌‌ను చూపించారు. రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌‌ల పాత్రలు ఆకట్టుకున్నాయి.  ‘నాది నాది నాది నాది .. నాదే  ఈ లోక‌‌మంతా.. కన్ను నాది, కాంతి నాది, ఏరుకున్న కలలు నావి.. మాట నాది, పాట నాది, బాట పక్క చోటు నాది.. బాధ నాది, బరువు నాది, బతుకు కొరకై బతుకు నాది..’ అంటూ సాగిన  పాటకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్‌‌ హైలైట్‌‌గా నిలిచింది.  నంద కిషోర్ రచించిన ఈ పాటను ధనుష్, హేమచంద్ర వేదాల కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేసింది.