ధనుష్, సాయిపల్లవి క్రేజీ కాంబో రిపీట్..

ధనుష్, సాయిపల్లవి క్రేజీ కాంబో రిపీట్..

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌లతో సెలెక్టివ్‌‌గా సినిమాలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటోంది సాయి పల్లవి.  ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  తాజాగా మరో క్రేజీ కాంబోని రిపీట్ చేయడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్‌‌తో మరోసారి స్ర్కీన్ షేర్ చేసుకోబోతోందట సాయి పల్లవి. ‘మారి 2’ చిత్రంతో హిట్ పెయిర్‌‌‌‌గా నిలిచిన ఈ జోడీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. 

ఇందులో హీరోయిన్‌‌గా సాయి పల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఏడేళ్ల క్రితం మారికి సీక్వెల్‌‌గా వచ్చిన ‘మారి 2’ చిత్రంలో ధనుష్,  సాయి పల్లవి చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. 

దీంతో ఈ క్రేజీ  కాంబోపై అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  సౌత్‌‌లో టాప్ హీరోయిన్‌‌గా కొనసాగుతూనే మరోవైపు  బాలీవుడ్‌‌లోనూ సాయి పల్లవి  వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.