
చాలామంది కోలీవుడ్ హీరోల్లాగే తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్, త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఈ సినిమా కంటే ముందు ధనుష్ పూర్తి చేయాల్సిన తమిళ చిత్రాలు చాలానే ఉన్నాయి. దీంతో శేఖర్ సినిమా సెట్స్‌కి వెళ్లేందుకు సమయం పట్టేలా ఉంది. కానీ అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపేలా ఈ సినిమా ఉంటుందట. హీరోయిన్‌గా పూజాహెగ్డేని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో నటిస్తున్న ధనుష్, ముందు ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. హైదరాబాద్‌లోనే ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వచ్చే వారం మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ధనుష్ నలభై నాలుగో మూవీ షూటింగ్ స్టార్టవబోతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. ఆ ముగ్గురూ ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ధనుష్ హీరోగా సెల్వ రాఘవన్ తీయబోతున్న ‘నానే వరువేన్’ షూటింగ్ ఆగస్టు 20 నుండి చెన్నైలో మొదలు కానుంది. అయితే ఈ టైటిల్ క్లాస్‌గా ఉందని, ధనుష్ ఇమేజ్‌కి తగ్గట్టు మాస్ టైటిల్ పెట్టమని హీరోని, డైరెక్టర్‌ని కోరారట నిర్మాత కలైపులి థాను. మరోవైపు తెలుగులో శేఖర్ కమ్ముల సినిమా ఫైనల్ కావడంతో ఇప్పటికే మరికొందరు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ధనుష్‌ని కలిసి కథలు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ ఓ మూవీ కన్‌ఫర్మ్ అయ్యిందని, వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ ఈ ఏడాదంతా తమిళ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఇయర్ పూర్తిగా టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.