
డిఫరెంట్ సబ్జెక్టుల్లో నటిస్తూ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు ధనుష్. ఇప్పటివరకు తను తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చి.. తెలుగు దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నాడు ధనుష్. ఆల్రెడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ మూవీ చేస్తోన్న ఆయన, అది రిలీజ్ కాకముందే మరో క్రేజీ డైరెక్టర్‌తో చేయి కలిపాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు నిర్మాతలు.